Header Banner

విద్యార్థులకు గుడ్‌న్యూస్ !! బరువు తగ్గిన పుస్తకాలు… పెరిగిన విద్యా నాణ్యత!

  Tue May 06, 2025 07:51        Politics

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ సెలవులు కొనసాగుతున్నాయి. మరో నెలరోజుల్లో మళ్లీ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే అకడమిక్ ఇయర్ గురించి.. కూటమి ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమై, పాఠాలు మొదలుపెట్టిన తర్వాత విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే విధానానికి స్వస్తి చెప్పి.. బడులు తెరిచేలోగానే పుస్తకాలను ఆయా స్కూళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి పుస్తకాల బరువును తగ్గించి.. పిల్లలకు అందించనున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా స్కూల్ పిల్లల బ్యాగుల బరువు తగ్గిస్తామని.. ప్రస్తుతం ఏపీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ చెప్పిన విధంగానే ఇప్పుడు పుస్తకాల బరువును తగ్గించేశారు.
ఈ నేపథ్యంలోనే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మారిపోయిన కొత్త పాఠ్యపుస్తకాలు.. తాజాగా మండల విద్యా వనరుల కేంద్రాలకు అధికారులు చేర్చారు. అయితే పుస్తకాల బరువును తగ్గించేందుకు ఈసారి విద్యాశాఖ అధికారులు తీవ్రంగా కృషి చేశారు. ఇక 1, 2వ తరగతులకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులను అన్నీ కలిపి ఒకే పాఠ్యపుస్తకంలో ముద్రించారు. దీంతో అనవసరమైన భారం విద్యార్థులకు తప్పనుంది. ఇలా చేయడం వల్ల ఇక నుంచి విద్యార్థులు.. అన్ని సబ్జెక్టులు కలిపి కేవలం 2 పుస్తకాలు మాత్రమే తమ స్కూల్ బ్యాగులో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా సెమిస్టర్‌ల వారీగా ఏటా 2 సార్లు పుస్తకాలను అందించనున్నారు.
ఇందులో భాగంగానే 3, 4, 5వ తరగతులకు సంబంధించి సెమిస్టర్‌-1 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లను అన్ని మండలాలకు పంపిణీ చేశారు. వీటిలో తెలుగు-ఇంగ్లీష్ ఒక దాంట్లో.. మ్యాథ్స్-ఈవీఎస్‌ మరో దాంట్లో ఉన్న పుస్తకాలను ముద్రించారు. గతంలో 3, 4, 5వ తరగతులకు సంబంధించి 4 పాఠ్యపుస్తకాలు, 4 వర్క్‌బుక్‌లు ఉండేవి. దీంతో మొత్తం కలిపి ఒక్క విద్యార్థి 8 పుస్తకాలను నిత్యం స్కూలుకు మోసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన కొత్త విధానంలో తెలుగు-ఇంగ్లీష్ ఒక పుస్తకంలో.. మ్యాథ్స్-ఈవీఎస్‌ మరో బుక్‌లో ఉంటాయి. ఇక వాటి వర్క్‌బుక్‌లను కూడా అలాగే ముద్రించారు. అంటే గతంలో 8 పుస్తకాలు తీసుకెళ్లే స్థానంలో ఇప్పుడు 3 పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇలా చేయడం వల్ల పుస్తకాల భారం నుంచి స్కూల్ విద్యార్థులను రక్షించవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగానే స్కూల్ విద్యార్థుల పుస్తకాల భారం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న పిల్లలు.. తమ పుస్తకాల భారాన్ని భరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్కూల్ స్టూడెంట్స్‌కు పుస్తకాల బ్యాగ్‌ బరువును తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేసే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..! అంబేద్కర్ ఓవర్సీస్ స్కీం రీ-లాంచ్! వారికి భారీ ఆర్థిక సాయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoodNewsForStudents #LighterBooks #BetterEducation #StudentLife #EducationReform